Ladakh Accident : లఢఖ్ మృతుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు సైనికులు
Ladakh Accident : లఢఖ్ దగ్గర నది దాటే ప్రయత్నంలో మరణించిన ఐదుగురు సైనికుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు.
Ladakh Accident :లఢఖ్ దగ్గన నది దాటి ప్రయత్నంలో మరణించిన ఐదుగురు సైనికుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో టీ72 యుద్ధ ట్యాంకుల్లో వెళ్తున్నప్పుడు లేహ్ కు 148కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరికి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లే గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ముత్తుముల రామక్రుష్ణారెడ్డి మరణించారు. ఈ ప్రమాదంలోనే క్రుష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు మరణించారు.
ధనలక్ష్మీ, వెంకన్నల కుమారుడు నాగరాజుకు 5ఏండ్ల క్రితం మంగాదేవితో వివాహం జరిగింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగానే దేశానికి సేవలు అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను నాగరాజు వీడియో కాల్లో చూసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. అంతలోనే ఈ వార్త తెలియడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంపూర్ లో సుమారు 100ఇండ్లు ఉండగా దాదాపు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు సైనికులు సెలక్ట్ అయ్యారు. వీరిలో కొందరు రిటైర్డ్ అయ్యారు.