AIADMK Headquarters: వర్గపోరుతో అన్నాడీఎంకే కార్యాలయం మూత

AIADMK Headquarters: ఐదు దశాబ్దాల చరిత్రలో ఇదే తొలిసారి

Update: 2022-07-12 13:00 GMT

AIADMK Headquarters: వర్గపోరుతో అన్నాడీఎంకే కార్యాలయం మూత

AIADMK Headquarters: తమిళనాడులోని అన్నా డీఎంకే పార్టీలో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. ఐదు దశాబ్దాల రెండాకుల పార్టీ చరిత్రల్లో తొలిసారి ఆఫీసు కార్యాలయం మూతపడింది. ఇంతకు ముందు పార్టీలో ఎన్నో వివాదాలు ఉన్నా ఎప్పుడూ రాళ్లదాడికి ఎవరూ దిగలేదు. ఎంజీఆర్‌ మరణం తరువాత.. జానకి, జయలలిత మధ్య పోరాటం జరిగినా.. ఇరువర్గాల అనుచరులు మాత్రం కొట్టుకోలేదు. పార్టీ కార్యాలయం వద్ద కూడా ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేవి. జయలలిత మరణం తరువాత.. పార్టీలో వర్గపోరు అధికమైంది. పన్నీరు సెల్వం, పళనిస్వామి పరస్పరం పార్టీపై పట్టుకు యత్నించారు. పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైలోని రాయపేటలోని ఏఐఏడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని

తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నాయకత్వ పోరుపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నమ్మినబంటు, మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌)పై మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) చర్యలు తీసుకున్నారు. ఆయన్ని కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. ఓపీఎస్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు వైతిలింగం, పీహెచ్‌ మనోజ్‌ పాండియన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు సోమవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. దీనికి ముందు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ నియమితులయ్యారు. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు ఈపీఎస్‌ చేతికి వచ్చాయి.

అందుకే ఓపీఎస్‌పై వేటేశాం

సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన 16 తీర్మానాల్లో ఓపీఎస్‌, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించే ప్రత్యేక తీర్మానం కూడా ఉన్నది. దీనికి పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు అన్నాడీఎంకే ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్నాడీఎంకేలో కోశాధికారిగా, సమన్వయకర్తగా ఉంటూ.. అధికార డీఎంకేకు ఓపీఎస్‌ మద్దతిస్తున్నారని, స్టాలిన్‌ పార్టీ నేతలతో సంబంధాలు పెంచుకొని.. పార్టీని బలహీనపరుస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఓపీఎస్‌పై వేటు వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్టీ నుంచి తనను తొలగించడంపై ఓపీఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలచే అన్నాడీఎంకే సమన్వయకర్తగా ఎన్నికయ్యానని తెలిపారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఎదుట ఓపీఎస్‌ మద్దతుదారులు ఆందోళన చేశారు.

అన్నాడీఎంకే ఐదు దశాబ్దాల చరిత్రలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. పార్టీలో ఇంతకు ముందు ఎన్నోసార్లు తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ ఒకరినొకరు గాయపడేలా ఘర్షణ పడిన సందర్భాలు లేనేలేవు. ఎంజీఆర్‌ మృతి తర్వాత జయ, జానకి వర్గాలంటూ పార్టీ రెండుగా చీలినప్పుడు కూడా ఇరువర్గాల చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగలేదు. జయలలిత బతికున్నప్పుడు పార్టీ కార్యాలయం వద్ద స్వల్ప ఘర్షణకు కూడా తావులేని విధంగా ఆ చోట కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం పార్టీ సర్వసభ్యమండలి సమావేశానికి పార్టీ సభ్యులంతా వెళ్ళిపోవటంతో అదను చూసి ఓపీఎస్‌ వర్గీయులు పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించటం తీవ్ర హింసాకాండకు దారితీసింది.

ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుస్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఈపీఎ్‌స-ఓపీఎస్‌ మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకొని ఘర్షణలకు పాల్పడిన సందర్భంగా రాయపేట పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఆర్డీవో సాయివర్ధిని వెళ్లి సీలు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో విలేఖరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో రెండు వర్గాలు విధ్వంస చర్యలకు పాల్పడడం వల్ల శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకొని ఆ కార్యాలయానికి సీలు వేసినట్లు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆ కార్యాలయం తమ స్వాధీనంలో ఉంటుందని, ఉద్రిక్తత కారణంగా 144 సెక్షన్‌ పార్టీ కార్యాలయం ప్రాంతంలో విధించినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News