భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,881 కేసులు నమోదు కాగా, 517 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,480 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 80,40,203 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,03,687 ఉండగా, 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,20,527 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.99 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.51 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,75,760 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,65,63,440 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.