భారత్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 82 లక్షల 67 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 38,310 కేసులు నమోదు కాగా, 490 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 58,323 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం 82,67,623 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,41,405 ఉండగా, 76,03,121 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,23,097 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 91.96 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.55 శాతంగా ఉంది.