Aligarh Muslim University: ఆలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో కరోనా బీభత్సం
Aligarh Muslim University: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన 34 మంది ప్రొఫెసర్లు కోవిడ్ కారణంగా గడచిన 20 రోజుల్లో మృతి చెందారు.
Aligarh Muslim University: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన 34 మంది ప్రొఫెసర్లు కోవిడ్ కారణంగా గడచిన 20 రోజుల్లో మృతి చెందారు. ఈ మరణాలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. అలీఘర్ వర్శిటీలో కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తున్నదని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి కోవిడ్-19 నమూనాలకు జినోమ్ టెస్టింగ్ నిర్వహించాలని కోరుతూ..ఆయన ఐసిఎంఆర్‌కు లేఖ రాశారు. యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఎఎంయు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోవిడ్-19 తో బాధపడుతున్నారని ఆ లేఖలో వివరించారాయన.