Paralympics 2024: పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతకాల జోరు

Paralympics 2024: 27 పతకాలతో 17వ స్థానంలో భారత్

Update: 2024-09-07 06:40 GMT

Paralympics 2024

Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. పారిస్‌లో పతకాల జోరు కొనసాగుతుంది. శారీరక వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి పతక వేటలో దూసుకెళ్తున్నారు. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడ్డ భారత్... ఇప్పుడు పారిస్‌లో అత్యధిక స్వర్ణాలను సొంతం చేసుకుంది. ఈ క్రీడలలో ఇప్పటికే దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసి 27 పతకాలు సాధించారు భారత అథ్లెట్లు. పతకాలు సాధించి భారత్ చేరుకున్న పారాలింపిక్స్ అథ్లెట్లకు విమానాశ్రయంలో భారీ స్వాగతం లభించింది. పతకాలు సాధించడం పట్ల అథ్లెట్లు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News