రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 92 కోట్ల కు అమ్ముడవ్వగా, సినిమా మాత్రం ఫుల్ రన్ లో రూ.62.64 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. అంటే ముప్పై కోట్ల నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్ గా మారింది.
ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. పైగా హాలిడే సీజన్ కాబట్టి ఈ మాత్రమైన వసూళ్లను సాధించింది. కానీ మిగతా ఏరియాలతో పోల్చి చూస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమా నైజామ్, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు రూ.32 కోట్లకు కొనుకున్నారు. కానీ సినిమాతో రూ.11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే ఓవర్సీస్ లో ఈ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా 'వినయ విధేయ రామ' క్లోజింగ్ కలెక్షన్స్:
నైజామ్: 12.58 కోట్లు
సీడెడ్: 11.92 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.51 కోట్లు
కృష్ణ: 3.69 కోట్లు
గుంటూరు: 6.36 కోట్లు
ఈస్ట్ : 5.42 కోట్లు
వెస్ట్: 4.42 కోట్లు
నెల్లూరు: 2.89 కోట్లు
ఎపీ + తెలంగాణ: రూ. 55.79 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.40 కోట్లు
ఓవర్సీస్: 1.45 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా: రూ. 62.64 కోట్లు