బాలకృష్ణ నందమూరి ని స్క్రీన్ మీద బోయపాటి తప్ప ఇంకెవరూ ఆ రేంజ్ లో పవర్ఫుల్ గా చూపించలేరు అని ఫాన్స్ నమ్మకం. సింహా, లెజెండ్ సినిమాల తో ఈ కాంబినేషన్ చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ కాంబినేషన్ మరలా జత కడుతుంది అని బాలకృష్ణ స్వయం గా ప్రకటించాడు కానీ ఇప్పుడు బాలకృష్ణే ఈ సినిమా ని పక్కన పెట్టేసాడు. అనుకోని విధంగా నిన్న బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు అనే వార్తలు బయటకి వచ్చాయి.
జై సింహా తర్వాత ఈ హీరో దర్శకుడు మరలా జత కడుతుండడం విశేషం. అయితే సడన్ గా బాలకృష్ణ బోయపాటి సినిమా ని పక్కన పెట్టడానికి ఒక కారణం ఉంది. ముందుగా బోయపాటి తో పొలిటికల్ థ్రిల్లర్ తీద్దామ్ అనుకున్నాడు బాలయ్య. ఎన్నికలు ముగిసాయి, ఇప్పుడు ఆ సినిమా చేయడం వలన ఉపయోగం లేదు అని ఇంకో కథ చేసుకొని రమ్మన్నాడు. బోయపాటి కొత్త స్క్రిప్ట్ తో తిరిగి వచ్చాడు కానీ ఈ సినిమా కోసం బాలకృష్ణ బరువు తగ్గాలి. అది జరగాలి అంటే మినిమమ్ మూడు నెలలు పడుతుంది. అందుకే ఈ లోపు రవికుమార్ తో సినిమా ని పట్టాలెక్కించాడు బాలయ్య. రవికుమార్ కూడా సినిమా ని త్వరగానే పూర్తి చేస్తాను అని మాట ఇచ్చారట. ఇది అయిన వెంటనే బోయపాటి తో సినిమా సెట్స్ మీద వెళ్తుంది.