Chiranjeevi Birthday Special: చిరంజీవి సాధించిన టాప్ 10 రికార్డ్స్..మెగాస్టార్‌కు మాత్రమే సాధ్యం
Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఇప్పటి వరకు సాధించిన టాప్ 10 రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరు తెలియనవారుండరు. మెగాస్టార్ గా సౌత్ లోనే కాదు..పాన్ ఇండియా లెవల్లో ఆయన పేరు మారుమ్రోగింది. తన నటనతో, మేనరిజంతో అప్పటి ఇప్పటి యవతను ఆకట్టుకుంటున్నారు. 69 ఏండ్లలోనూ ఆయన చెక్కు చెదరని అందంతో ఎంతోమందిని ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నరు. నేడు చిరంజీవి 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవిన తన 46ఏండ్ల సినీ ప్రస్థానంలో సాధించిన రికార్డుల గురించి ఓసారి చూద్దాం.
-మెగాస్టార్ చిరంజీవికి 1990వ దశకంలోనే అంతర్జాతీయంగా ఆయన సినిమాలకు ఆదరణ ఉంది. కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి డబ్బింగ్ అయినా తొలి తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించడం విశేషం.
-1987లోనే మెగాస్టార్ చిరంజీవికి ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఆ సంవత్సరం ఆస్కార్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ కూడా చిరంజీవి కావడం విశేషం.
-పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డాన్స్ అనే ప్రక్రియను తెలుగు సినిమా పైన పరిచయం చేసింది. మెగాస్టార్ చిరంజీవి కావడం విశేషం.
-ద్విపాత్రాభినయం అలాగే త్రిపాత్రాభినయం పాత్రల్లో రెండు సినిమాల్లోనూ నటించి 100 రోజులు ఆడిన రికార్డు కూడా మెగాస్టార్ చిరంజీవికే దక్కింది.
-ప్రేక్షకులకు ఎప్పుడు కొత్తదనాన్ని అందించేందుకు తాపత్రయపడే మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారు సినిమా కోసం 240 అడుగుల ఎత్తు నుంచి బంగి జంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
-నేటి రోజుల్లో సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయడానికి హీరోలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది 1980 అలాగే 83 సంవత్సరాల లో చిరంజీవి ఒకే సంవత్సరం 14 చిత్రాల్లో నటించడం విశేషం.
-ఐటీ చెల్లింపుల్లో చిరంజీవి ఎప్పుడు ముందంజలో ఉండేవారు ఆయన సకాలంలో ఇన్కమ్ టాక్స్ కడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2002వ సంవత్సరంలోనే సమాన్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించింది
-1992లో భారతదేశ సినీ ఇండస్ట్రీలోనే తొలిసారిగా ఒక కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించారు అప్పటికే సూపర్ స్టార్ గా ఉన్న అమితాబచ్చన్ రజినీకాంత్ కు సైతం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ లేదు
-కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అందుకున్న నటుడిగా చిరంజీవి కొత్త రికార్డు సృష్టించారు.