Puri Jagannadh Praises AP CM YS Jagan: హ్యాట్సాఫ్ సీఎం సార్

Puri Jagannadh Praises AP CM YS Jagan: ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2020-07-01 14:09 GMT
Puri Jagannadh (File Photo)

Puri Jagannadh Praises AP CM YS Jagan: ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రూ. 203 కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి 88 , 108, 104 వాహనాలను కొనుగోలు చేసింది . వీటిని బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ లోని బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు సీఎం జగన్. వీటిని రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు. దీనితో ఏపీ ప్రభుత్వం యొక్క పనితీరును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు.. అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు. పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో104,108 అంబులెన్స్ ల సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ కి అభినందనలు తెలిపారు పూరి జగన్నాథ్.. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇక గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ ప్రమాదం జరిగిన ఫోన్ వచ్చిన వెంటనే 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి ఈ వాహనాలు చేరుకోనున్నాయి. ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు ఉంటుంది. అంతేకాదు ప్రతి అంబులెన్సులోనూ ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ వాహనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎల్ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ చైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీపారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏఎల్ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్య సేవలందించేలా లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇటు చిన్నారులకు వైద్యం అందించే నియోనేటల్‌ కేర్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లను తీర్చిదిద్దారు.



Tags:    

Similar News