Tollywood: బొమ్మపడాలంటే మాకు రెండూ కావాలి

Tollywood: తెలంగాణతో పాటు ఏపీలో కూడా థియేటర్లు ఓపెన్ చేయాలంటున్న టాలీవుడ్ నిర్మాతలు...

Update: 2021-06-20 02:08 GMT

Cinema Theaters:(File Image)

TollyWood: పెద్ద హీరోలు, చిన్న హీరోలు ... పెద్ద, చిన్నా నిర్మాతలంతా ఆవురావురుమంటూ థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారా.. తెర మీద తమ బొమ్మ వేసేసుకుని.. డబ్బులు వసూలు చేసుకుందామా అని చాలా ఓపికగా ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇక వారికి ఊపిరి అందుతుందని అంతా అనుకున్నారు. కాని వారు మాత్రం తమ ముక్కుకు రెండు రంథ్రాలు ఉన్నట్లే.. తమకు రెండు రాష్ట్రాల్లో బిజినెస్ ఉందని.. ఏపీలో కూడా థియేటర్లు ఓపెన్ చేస్తేనే తమకు పూర్తిగా ఊపిరి అందుతుందని అంటున్నారు,

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లని యథావిధిగా తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చిత్రసీమకి ఇది ఊరట కలిగించే విషయమే. దాదాపు రెండు నెలలైంది ప్రదర్శనలు నిలిచిపోయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదల ముంగిట ఆగిపోవల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రాలన్నీ విడుదలకి సన్నద్ధమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాకి 60 శాతం మార్కెట్‌ అక్కడే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతేనే అందరికీ మేలు జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనుమతులు ఇచ్చేవరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోయినా మల్టీప్లెక్స్‌లో మాత్రం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో 600కిపైగా థియేటర్లు ఉన్నాయి. అందులో 250కిపైగా ఉన్న మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌ థియేటర్లు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కింద ఉంటాయి

Tags:    

Similar News