Thalapathy Vijay's TVK Party Flag: పార్టీ జండాను లాంచ్ చేసిన స్టార్ హీరో విజయ్.. జండాకి అర్థం ఏంటంటే..
Thalapathy Vijay's TVK Party Flag: తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తాను స్థాపించిన తమిరగ వెట్రి కరగం పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీనే టీవీకే పార్టీ పేరును ప్రకటించిన విజయ్.. తాజాగా పార్టీ జండాను ఆవిష్కరించారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తమిరగ వెట్రి కరగం పార్టీ జండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ ఆంథెమ్ ప్రార్థన చేయించారు. 2026 లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో బరిలో నిలిపే దిశగా విజయ్ అడుగులేస్తున్నాడు.
2024 లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే పార్టీని ప్రకటించినప్పటికీ విజయ్ ఆ ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపలేదు. అలాగే మరే ఇతర రాజకీయ పార్టీకి తన మద్దతును కూడా ప్రకటించలేదు.
తమిరగ వెట్రి కరగం పార్టీ జండాలో ఏముందంటే..
తమిరగ వెట్రి కరగం పార్టీ జండా పార్టీలో రెండు రంగులున్నాయి. అందులో ఒకటి పసుపు రంగు కాగా రెండోది ముదురు ఎరుపు రంగు. పైన, కింద మెరూన్ కలర్ ఉండగా మధ్యలో యెల్లో కలర్ ఉంది. నడిమధ్యలో అదే మెరూన్ రంగుతో ఒక వలయం, ఆ వలయం లోపల మళ్లీ పసుపు రంగులో చుక్కలు ఉన్నాయి. ఆ వలయం మధ్య భాగంలో వాగై పువ్వు ఉంది. ఈ వలయానికి రెండు వైపులా ఘీంకరిస్తున్నట్లుగా రెండు ఏనుగులు ఉన్నాయి.
ఇంతకీ వాగై అంటే ఏంటి..
తమిళంలో వాగై అంటే ఒక చెట్టు. పురాతన కాలంలో యుద్ధాలు గెలిచిన రాజులు విజయానికి ప్రతీకగా ఈ చెట్టు పూలతో చేసిన హారాలు మెడలో ధరించే వారు. అంటే ఒక రకంగా తమిళ సంస్కృతి, సంప్రదాయాల్లో వాగై అంటే విజయం అనే అర్థాన్ని సూచిస్తుంది. అందుకే విజయ్ తన పార్టీ జండాలోనూ విజయం కనిపించేలా ఇలా డిజైన్ చేయించారు. అయితే త్వరలోనే తమిరగ వెట్రి కరగం పార్టీ సభ ఏర్పాటు చేసి అదే వేదికపై తన పార్టీ జండాకు ఉన్న పూర్థి అర్ధాన్ని చెబుతానని విజయ్ ప్రకటించారు.