Prabhas: డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? న్యూఇయర్ వేళ ప్రభాస్ స్పెషల్ వీడియో..
Prabhas Drugs Awareness Video: న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
Prabhas Drugs Awareness Video: న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. లైఫ్‌లో మనకు బోల్డన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అలాగే మనల్ని ప్రేమించే మనుషులు.. మన కోసం బతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్టింగ్స్? అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు.
జీవితాన్ని నాశనం చేసే మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని పిలుపునిచ్చారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైన డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్‌ఫ్రీ నంబర్ 8712671111కు కాల్ చేయాలని సూచించారు. డ్రగ్స్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. బాధితులు కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. రేపు జనవరి 1 కాబట్టి ఈ రోజు రాత్రి ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి సమయంలో అవగాహన కల్పిస్తూ ప్రభాస్ వీడియో సందేశం విడుదల చేశారు.