Simbaa: ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ.. టాప్‌లో ట్రెండ్ అవుతోన్న 'సింబా'..!

Simbaa: ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది.

Update: 2024-09-16 10:45 GMT

Simbaa: ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ.. టాప్‌లో ట్రెండ్ అవుతోన్న 'సింబా'..!

Simbaa: ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్‌గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు.

ఆగస్టు 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇక మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలిగింది.

ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ వేదిగా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు, ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.

డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ ‌కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ మంచి మెసేజ్‌ మూవీని చూసేయండి.

Tags:    

Similar News