RGV Vs Pawan: పవన్ ట్వీట్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన ఆర్జీవీ..సోషల్ మీడియాలో సెగలు.. పొగలు
* ఆర్జీవీ-పవన్ మధ్య పొలిటికల్ వార్ హీట్ ఎక్కింది. సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ను బదులుగా రాంగోపాల్ వర్మ అదే స్టయిల్ లో రిప్లై ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే...
RGV Vs Pawan: దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద కామెంట్స్ లో నెట్టింట వైరల్ గా మారాడు. ముఖ్యంగా చంద్రబాబు,పవన్ లక్ష్యంగా చేసుకొని ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన జనసైనికులను, ఫ్యాన్స్ ను వెన్నుపోటు పొడిచి చంపేస్తున్నారంటూ ట్వీట్ చేసిన ఆర్జీవీ..మరోసారి పవన్ పై సెటైర్లు వేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పాపం పసివాడు సినిమా పోస్టర్ ను ట్వీట్ చేసిన పవన్..ఈ సినిమాను ఎవరైనా సీఎంతో తీస్తే బాగుంటుందని కామెంట్ చేశారు. అంతేకాదు, సీఎం చేతిలో ఒక సూట్ కేస్ కాకుండా సూట్ కేస్ కంపెనీలు ఉంచాలన్నారు. అలాగే, మీరేమీ పుచ్చలపల్లి సుందరయ్య కాదు, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాదు..ప్రజలను హింస పెడుతున్న మీకు క్లాస్ వార్ పదాన్ని పలికే హక్కు లేదని పవన్ అన్నారు. పాపం పసివాడు కథకు రాజస్థాన్ ఏడారిలో ఇసుక తిన్నెలు అవరసరమని...కానీ ఏపీలో వైసీపీ లూటీ చేసిన ఇసుక తిన్నెలు సినిమా తీసేందుకు సరిపోతాయంటూ వ్యంగ్య బాణాలు సంధించారు.
నిజాంపట్నం బహిరంగ సభలో తనపై సీఎం జగన్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ పవన్ ఈ విధంగా ట్వీట్ చేయగా దీనికి బదులుగా రాంగోపాల్ వర్మ కౌంటర్ ఎటాక్ చేశారు. పవన్ తో ఎవరైనా సినిమా తీయాలని ఎదురు చూస్తున్నానంటూ ఆర్జీవీ అన్నారు. పవన్ ను అజ్ఞానంతో నిండిన అమాయకులు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఒక పాత్రను పోషించే బదులు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రలను పోషించాలంటూ విమర్శించారు. పవన్ ఏమీ ఎన్టీఆర్ కాదు ఎంజీఆర్ అంతకన్నా కాదని...ఆయనకు ప్రజా సేవ అనే పదాన్ని పలికే అర్హత లేదని కౌంటర్ ఇచ్చారు. ఇక పవన్ సినిమాకి హైదరాబాద్ కావాలని ఎందుకంటే అక్కడ ఎందరో అమాయక అనుచరులు ఉన్నారంటూ రాంగోపాల్ వర్మ విరుచుకుపడ్డారు. మొత్తానికి, అటు పవన్ ట్వీట్..ఆ ట్వీట్ కి రాంగోపాల్ వర్మ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.