Akira Nandan: నాన్నకు ప్రేమతో.. పవన్ జర్నీపై అకీరా స్పెషల్ వీడియో..

పవన్ జర్నీని పురస్కరించుకుని ఆయన కుమారుడు అకీరా నందన్ ఒక స్పెషల్ వీడియో చేశాడు

Update: 2024-06-06 05:37 GMT

Akira Nandan: నాన్నకు ప్రేమతో.. పవన్ జర్నీపై అకీరా స్పెషల్ వీడియో..

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు పపన్ కళ్యాణ్. ఇంకా ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన అందరూ కూడా అన్ని స్థానాల్లోనూ విజయ కేతనం ఎగిరేశారు. ఇక సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, మహేశ్ బాబు, రవితేజ తదితరులు పవన్ కు విషెస్ తెలిపారు. రేణు దేశాయ్ కూడా పవన్ కు అభినందనలు తెలిపింది. ‘పవన్‌ కల్యాణ్‌ విజయంతో ఆద్య, అకిరాలు చాలా సంతోషంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తీర్పు తో ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను’ అంటూ మాజీ భర్త విజయాన్ని స్వాగతించింది.

ఇక పవన్ జర్నీని పురస్కరించుకుని ఆయన కుమారుడు అకీరా నందన్ ఒక స్పెషల్ వీడియో చేశాడు. ఆ వీడియోను షేర్ చేసిన రేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అకిరా వాళ్ల నాన్న జర్నీ గురించి ఒక వీడియో ఎడిట్ చేశాడంటూ ఆమె క్యాప్షన్ పెట్టారు. అయితే, పవన్ జర్నీ వీడియోను అకిరా షేర్ చేయమని తనకు చెప్పాడని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా ఫోన్ చేసి నాన్న జర్నీ వీడియో షేర్ చేయమని చెప్పాడు. అకిరా ఆనందం కోసం ఇది షేర్ చేశాను. ‘‘నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనం’’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు.


Tags:    

Similar News