పవన్ కళ్యాణ్ సతీమణి గా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితురాలే కానీ వారు ఇద్దరూ చట్టబద్ధం గా విడిపోయాక రేణు తన సొంత వూరు పూణే వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా వేరే ఒకరిని పెళ్ళి చేసుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత రేణు కూడా రెండో పెళ్ళికి సిధ్ధమ్ అయ్యి, ఆ మధ్య నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అనే విషయాన్ని మాత్రం మీడియా కి దాచిన రేణు, పెళ్ళికి మాత్రం సిద్ధం అనే విషయాన్నీ చెప్పకనే చెప్పింది.
అయితే నిశ్చితార్థం జరిగిన చాలా కాలానికి కూడా ఇంకా రేణు నుండి పెళ్ళి కబురు రాలేదు అని చాలా మంది మీడియా వాళ్ళు పెళ్ళి ఆగిపోయింది అని కొన్ని తప్పుడు వార్తలు సృష్టించడం జరిగింది. అయితే రేణు ఈ విషయమై ఇటీవలే స్పందించి ఒక క్లారిటీ ఇచ్చారు. "నేను ఎవరినీ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం లేదు. నేను నా శ్రేయోభిలాషులకు అందరికి చెప్పి పెళ్ళి చేసుకుంటాను. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే చెప్పలేను." అని రేణు చెప్పారు. అయితే రేణు చేసుకోబోయే అతను సెటిల్ అయ్యే పనుల్లో ఉన్నారట. అందుకే పెళ్లి కాస్త ఆలస్యం కానున్నది అంట.