టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్

Tollywood: పోకిరి రీ రిలీజ్ సూపర్ హిట్

Update: 2022-08-21 04:15 GMT

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్

Tollywood: టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల విడుదల కంటే.. పాత సినిమాల రీ రిలీజ్‌ల హడావుడి కనిపిస్తోంది. దశాబ్దాల క్రితం అగ్ర హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి చెప్పుకోదగ్గ వసూళ్లను నిర్మాతలు అందుకునేవారు‌. కానీ ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించేందుకు ఈ టెక్నిక్‌ను వాడుకునెందుకు సిద్దమయ్యారు.

ఒకప్పుడు ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటంలో సినిమాలే ముందుడేవి. సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసినా థియేటర్స్ ముందు ఆడియన్స్ బారులు తీరేవారు. ఆ తర్వాత వచ్చిన డిజిటల్ విప్లవం సినిమా పరిధిని తగ్గించేసింది. ఫోన్‌లోనే ఎంటటైర్మెంట్ అంతా దొరుకుతోంది. ఏ సినిమా కావాలన్నా యూట్యూబ్స్, ఓటీటీల ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. క్రమంగా థియేటర్లకు ఆడియన్స్ రావటం తగ్గిపోతోంది. ‌అయితే టెక్నాలజీ వల్ల సినిమాలకు ఏర్పడ్డ ఈ ఇబ్బందిని, తిరిగి అదే టెక్నాలజీ తో పరిష్కరించే మార్గం నిర్మాతలకు తట్టింది. సూపర్ హిట్ అయిన పాత సినిమాకు కొత్త హంగులు అద్ది రీ రిలీజ్ చేస్తే...కాసుల వర్షం కురిపించింది. ఇందుకు మహేష్ బాబు 'పోకిరి' సినిమాకు లభించిన ఆదరనే సరైన ఉదాహారణ.

16 ఏళ్ల క్రితం వచ్చిన పోకిరి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అనేకమార్లు ఈ సినిమా టెలివిజన్‌లో ప్రసారమైంది. ఓటిటిలో కూడా అందుబాటులో ఉంది. అయితే అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మహేష్ బర్త్ డే సందర్భంగా 4కే వెర్షన్‌లో రీమాస్టరింగ్ చేసి, ప్రపంచవ్యాప్తంగా 200 లోకేషన్స్‌లో రీరిలీజ్ చేశారు. అన్ని చోట్ల కళ్లు చెదిరే వసూళ్లను రాబట్టింది. 'పోకిరి' రీ రిలీజ్‌తో నిర్మాతలకు దాదాపు కోటిన్నర లాభాలు వచ్చాయని సమాచారం. మరోపక్క మిగిలిన హీరోల అభిమానులు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. తమ అభిమాన హీరో కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా 'జల్సా' సినిమాను సెకండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో.. ఆయన అభిమానులు సైతం 'ఘరానా మొగుడు' రీ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరు కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో 'ఘరానా మొగుడు' ఒకటి. ఇక ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. అయితే ఆ రోజు శివ సినిమాను రీరిలీజ్ చేయాలని అభిమానులు ముచ్చట పడుతున్నారు. ఇందులో భాగంగానే 'శివ' మూవీని 4కే వెర్షన్‌లో విడుదల చేయమంటూ రాంగోపాల్ వర్మను, నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ విధంగా స్టార్ హీరోలకున్న ఛరిష్మా , థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు ఈ రకంగా ఉపయోగపడుతోంది. మరోవైపు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తొంది.

Tags:    

Similar News