Mr Bachchan Movie OTT Release Date: ఓటీటీలోకి మిస్టర్ బచ్చన్‌.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా.?

Mr Bachchan Movie OTT Release Date: ఈ సినిమాను సెప్టెంబర్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

Update: 2024-08-24 14:24 GMT

Mr. Bachchan: ఓటీటీలోకి మిస్టర్ బచ్చన్‌.. స్ట్రీమింగ్ అప్పటి నుంచేనా.? 

Mr Bachchan Movie OTT Release Date: మాస్‌ మహారాజా రివితేజ హీరోగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్‌ బచ్చన్‌'. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌కు ప్లస్ అవుతుందని అంతా భావించారు. అయితే ఓ పాటలోని స్టెప్‌తో నెట్టింట నెట్టింట ఈ సినిమాపై టోల్స్‌ వచ్చాయి. దీంతో సినిమాపై నెగిటివ్‌ ఇంపాక్ట్ పడింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలనే మిగిల్చిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి పెద్ద సినిమాలు కనీసం మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రావాలనే నిబంధన ఉంది. అయితే మిస్టర్‌ బచ్చన్‌ నెగిటివ్‌ టాక్‌ను మూటగట్టుకోవడంతో అనుకున్న సమయానికి కంటే ముందు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ బచ్చన్‌ ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది.

ఈ సినిమాను సెప్టెంబర్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. తెలుగుతోపాటు.. త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఒకేరోజు అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే మరోవైపు ఈ సినిమా సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందని మరో వార్త కూడా వైరల్ అవుతోంది. వినాయక చవితి నేపథ్యంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి మిస్టర్‌ బచ్చన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Full View


Tags:    

Similar News