'చలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండవ సినిమా 'గీతగోవిందం' తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ విజయ్ దేవరకొండ తోనే 'డియర్ కామ్రేడ్' అనే సినిమాలో నటిస్తోంది రష్మీక. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 31వ తేదీన విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న కు బాలీవుడ్ నుంచి పిలుపు అందింది అని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తో రష్మీక ఒక సినిమా చేయబోతోందని తెలుస్తుంది.
'రామ్ లీలా', 'బాజీరావ్ మస్తానీ', ఈమధ్యనే 'పద్మావత్' లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడు రణదీప్ హూడా హీరోగా ఒక సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం సౌత్ బ్యూటీ రష్మిక మందన్న ను హీరోయిన్ గా సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి కానీ ఇంకా రష్మీక ఇంకా సైన్ చేయలేదు అని తెలుస్తోంది. ఒక రష్మిక ఒప్పుకోకపోయినా వేరే ఆప్షన్లను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. కానీ అలాంటి దర్శకుడితో బాలీవుడ్లో అడుగు పెట్టె అవకాశం రావడం రష్మిక అదృష్టం అని చెప్పుకోవచ్చు.