ఈ మధ్య సినిమాలు విడుదలైన కొన్నాళ్ళకే డిజిటల్ మీడియా లో మెరుస్తున్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎఫ్ 2' సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. మరొకవైపు 'వినయ విధేయ రామ' కూడా మార్చి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. 'రోబో' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన '2.౦' సినిమా డిజిటల్ వెబ్ సైట్స్ లోకి ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వారు మార్చి నుంచి '2.ఓ' సినిమా లైవ్ స్ట్రీమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే '2.౦' సినిమా పూర్తిగా త్రీడీ టెక్నాలజీ మీద ఆధారితమై విడుదలైన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమా. అలాంటి సినిమాను 3డి ధియేటర్ లలో చూస్తేనే బాగుంటుంది. నిజానికి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లలో 2డి థియేటర్ లో కంటే 3డీ థియేటర్ లో నే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. మరి ఇప్పుడు ఆ సినిమాని లైవ్ స్ట్రీమింగ్ లోఎంతమంది చూస్తారో అనే విషయం పై సందేహాలు వస్తున్నాయి. మరొక వారంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు విడుదల కానుంది అనే విషయం పై క్లారిటీ రానుంది.