PVP: అలాంటి కొడుకుల కుత్తుకలు కోయాలి.. పీవీపీ సంచలన కామెంట్స్

PVP: దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమా సందడి నెలకొంది.

Update: 2022-03-25 13:33 GMT

PVP: అలాంటి కొడుకుల కుత్తుకలు కోయాలి.. పీవీపీ సంచలన కామెంట్స్

PVP: దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమా సందడి నెలకొంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంతాఇంతాకాదు. బాక్సాఫీస్ ముందు బంపర్ హిట్ కొడుతుందని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. అయితే కొంత మంది మాత్రం రాజమౌళి సినిమా సరిగ్గా చేయలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారి మీద నిర్మాత పొట్లూరి వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలంటూ తన ట్విట్టర్‌ లో రాసుకొచ్చారు పీవీపీ. తనకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. సినీ ప్రపంచంలో భయపడుతూ బ్రతికే వాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండని పిలుపు నిచ్చారు. 



Tags:    

Similar News