కేవలం కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'లవర్స్ డే' అనే టైటిల్ తో ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అంత పాపులారిటీ సంపాదించిన ప్రియ కు ఆ సినిమాలో ప్రాధాన్యత తక్కువ ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా యూత్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఇప్పుడు డిజాస్టర్ గా మారిన ఈ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్ కు అసలు ఆఫర్లు వస్తాయా లేదా అనేది ఆసక్తికరమైన విషయం గా మారింది.
గతేడాది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వచ్చింది కానీ మిస్ చేసుకున్నానని ఈసారి వస్తే ఖచ్చితంగా నటిస్తానని ప్రియా ప్రకాష్ వారియర్ ఆడియో లాంచ్ అప్పుడు చెప్పింది. కానీ 'లవర్స్ డే' ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ సినిమాలు పక్కన పెడితే వేరే ఏ సినిమా నుంచి అయినా ఆఫర్లు వస్తాయా లేదా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. నిజానికి ఆమె వీడియో వైరల్ గా మారినప్పుడే ఆమెకు అన్ని భాషల నుండి ఆఫర్లు వచ్చాయి. అప్పుడే సినిమాలకు సైన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.