Kalki 2898 AD: కల్కి ఫీవర్‌తో ఊగిపోతున్న వరల్డ్‌ బాక్సాఫీస్‌.. అంతకు మించి..!

Kalki 2898 AD: ఇప్పటికే కల్కి ఫీవర్‌తో బాక్సాఫీస్‌ ఊగిపోతోందని చెప్పడంలో ఎలా సందేహం లేదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాలో అన్ని అద్భుతాలే.

Update: 2024-06-26 11:31 GMT

Kalki: కల్కి ఫీవర్‌తో ఊగిపోతున్న వరల్డ్‌ బాక్సాఫీస్‌.. అంతకు మించి.. 

Kalki 2898 AD: కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడా విన్నా ఇదే మాట. ఒక సినిమా ఇంతలా బజ్‌ క్రియేట్ చేయడం మాములు విషయం కాదు. ఒక ఇండియన్‌ సినిమా అందులోనూ ఒక తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది. పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో తెరకెక్కిన కల్కి 2898ఏడీ సినిమాపై ఆకాశన్నంటేలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ కల్కి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.

అందరి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కల్కి మరికొన్ని గంటల్లో ప్రేక్షకులను పలకరిచేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే కల్కి ఫీవర్‌తో బాక్సాఫీస్‌ ఊగిపోతోందని చెప్పడంలో ఎలా సందేహం లేదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమాలో అన్ని అద్భుతాలే. అమితాబ్‌, దిశాపఠాని, దీపికా పదుకొనణెతో పాటు మరెంతో మంది సీనియర్‌ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి. ఇక కల్కి ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఎక్కడ కల్కి టికెట్స్‌ ఓపెన్‌ అయినా క్షణాల్లో బుక్‌ అయిపోతున్నాయి. ఎంతలా అంటే వెబ్‌సైట్స్ క్రాష్‌ అయ్యేంతలా. ఇక అందరికంటే ముందుగా అమెరికాలో ఫ్యాన్స్‌ కల్కిని వీక్షించనున్నారు. దీంతో ఓవర్‌సీస్‌ బిజినెస్‌లో కూడా కల్కి సరికొత్త చరిత్రను తిరగ రాసింది. కేవలం ప్రీ బుక్సింగ్స్‌తోనే ఈ సినిమా అమెరికాలో ఏకంగా 4 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటేసిందని తెలుస్తోంది. అమెరికాలో 3000 షోలకు గాను ఇప్పటికే 1.5 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి.

ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో బీభత్సమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలకు రెండు రోజుల ముందే 4 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సంచలన రికార్డును సాధించింది. దీనిబట్టే కల్కి సినిమా ఫీవర్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాకు ఏమాత్రం పాజిట్‌ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దాలు కావాల్సిందేనని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదల కానున్న కల్కి ఎలాంటి రికార్డ్స్‌ తిరగరాస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News