Prabhas Adi Purush Movie Updates: ప్రభాస్ 'ఆదిపురుష్'లో ప్రతి నాయకుడుగా బాలీవుడ్ నటుడు!

Prabhas Adi Purush Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్ త‌న అభిమానుల చాలా పెద్ద స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెర కెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు

Update: 2020-08-19 17:01 GMT
Prabhas Adi Purush Movie Updates: ప్రభాస్ ఆదిపురుష్లో ప్రతి నాయకుడుగా బాలీవుడ్ నటుడు!
Prabhas Adi Purush Movie Updates
  • whatsapp icon

Prabhas Adi Purush Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్ త‌న అభిమానుల చాలా పెద్ద స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే భారీ చిత్రం తెర కెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు. 'ఆదిపురుష్ ' సినిమా పేరే కాదు.. 'చెడు మీద మంచి సాధించిన విజయం' అనే ట్యాగ్ లైన్‌ కూడా అభిమానుల్లో మ‌రింత ఉత్స‌హాన్ని రేపుతుంది. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండ‌టం.. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటం.. ఈ చిత్రంలో ప్రభాస్.. రాముడి పాత్రను పోలిన పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే  ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడు రావ‌ణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని, ఆ పాత్రలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తి నాయకుడైన  ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్ర పోషించి.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు. అందుకే, రావణుడి పాత్రకు ఆయనైతే న్యాయం చేయగలరని ఓం రౌత్ భావించారట. సైఫ్ కూడా ఈ పాత్ర‌కు ఓకే అన్న‌ట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రంలో న‌టించే వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం. కాగా, ఈ చిత్ర నిర్మాణానికి  టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంటే.. ప్రభాస్ ఖాతాలోనే కాదు.. భారతీయ సినిమాలోనే భారీ బడ్జెట్ మూవీగా నిర్మితంకానుద‌న్న‌మాట.

Tags:    

Similar News