Prabhas 22 Update: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీతగా అనుష్క శర్మ?
Prabhas 22 Update | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే..
Prabhas 22 Update | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు ప్రభాస్... ఇది ప్రభాస్ కి 22 వ సినిమా... ఈ సినిమాకి 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని సమాచారం.. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొన్నటివరకు ప్రభాస్ సరసన సీత పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్, కియరా అద్వానీ నటించనున్నారని వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు వారి స్థానంలో బాలీవుడ్ భామ అనుష్క శర్మ పేరు వినిపిస్తోంది.
బాలీవుడ్ లో అనుష్క శర్మ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే, అనుష్క ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా? ఆమె ఎలా ఒప్పుకుని వుంటుంది? అన్న డౌట్ మనకు రావడం సహజం. అది నిజమే.. అనుష్కకు జనవరిలో డెలివరీ అవుతుంది. ఈ విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కూడా జనవరిలోనే మొదలవుతుందాని, ముందుగా ప్రభాస్, ఇతర తారాగణంపై సన్నివేశాల భాగాన్ని పూర్తిచేస్తారని సమాచారం. అంతే కాదు, డెలివరీ అయిన రెండు నెలల తర్వాత తాను షూటింగ్ కి రెడీ అయిపోతానని అనుష్క శర్మ చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం .
తాజాగా మేకర్స్.. ఈ మూవీలో విలన్ గా, రావణాసురుడు లంకేష్ రోల్ లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించనున్నట్లుగా వెల్లడించారు. గతంలో దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. వాస్తవానికి అదిపురుష్ లో ముందుగా విలన్ గా అజయ్ దేవగన్ ని తీసుకోవాలని మేకర్స్ భావించారు.. కానీ అయన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మేకర్స్ సైఫ్ అలీ ఖాన్ ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోల్స్ ఊపందుకున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌ని తొలగించి వేరే యాక్టర్‌ని తీసుకోండంటూ కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. దాదాపుగా వేయి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.