పవన్ మొదటి సినిమాకి 23 ఏళ్ళు....
కొన్ని ప్రారంభాలు సృష్టించే సంచలనాలు అప్పుడు అర్థం కావు. కానీ, ఒక్క అడుగు అనుకున్నది తరువాతి కాలంలో ప్రభంజనమై జనం గుండె చప్పుడుగా మారిపోతుంది. అటువంటిదే.. ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా అయన తమ్ముడు పవన్ కళ్యాన్ తెలుగు తెరను పలకరించిన రోజు ఈరోజు. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఓ సినిమా హీరోగా ఆరంగేట్రం ఇచ్చిన పవన్ ఇప్పుడు లక్షలాది మంది అభిమానుల గుండె చప్పుడుగా ఎదిగారు. ఇక్కడ అబ్బాయిగా తెర మీద ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇక్కడి వాడిగానే ఎదిగారు.. ఇక్క్కడి (తెలుగు) వారితోనే మమేకమై పోయారు.
మెగస్టార్ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.. అతి కొద్ది సమయంలోనే మంచి హిట్లను సంపాదించుకొని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అయన నటించిన మొదటి సినిమా " అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి " సినిమా నేటితో 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కి జోడిగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ అక్క సుప్రియ నటించింది. అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించగా ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 11 అక్టోబరు 1996న విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా..
Powerstar @PawanKalyan 's Debut Film #AkkadaAmmayiIkkadaAbbayi Completes 23 Years!
— Geetha Arts (@GeethaArts) October 11, 2019
Directed by #EVVSatyanarayana
Produced by #AlluAravind #23YearsForPawanKalyanInTFI pic.twitter.com/GZV7DHXDH9