పవన్ మొదటి చిత్రానికి 24 ఏళ్ళు!
Pawan Kalyan Completes 24 years : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి..
Pawan Kalyan Completes 24 years : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. అలాంటి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 24 ఏళ్ళు పూర్తి అయ్యాయి.. 1996 అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ నటించిన మొదటి చిత్రం "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా విడుదలైంది. దీనితో పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానానికి 24 ఏళ్ళు పూర్తి అయ్యాయి అన్నమాట. ఈ సందర్భంగా ఈ రోజును పవన్ అభిమానులు "వరల్డ్ పవనిజం డే" గా జరుపుకుంటున్నారు.
ఇక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కి జోడిగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ అక్క సుప్రియ నటించింది. అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించగా, ఈవివి సత్యనారాయణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. బాలీవుడ్ లో వచ్చి మంచి హిట్టైన "ఖయామత్ సే ఖయామత్ తక్" సినిమాను ఇది రీమేక్ కావడం విశేషం.. ఇక ఇందులో పవన్ చేసిన రియల్ ఫీట్స్ కూడా సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలిచాయి. అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా ఈ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి ఖుషి సినిమా వరుసుగా ఏడూ హిట్లను అందుకున్నాడు పవన్ కళ్యాణ్..
ఇక అజ్ఞాతవాసి చిత్రం తరవాత సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయన బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్.