ఈసారి జాతీయ సినిమా అవార్డు ల జాబితాలో తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అవి 'మహానటి', 'రంగస్థలం', 'కేర్ ఆఫ్ కంచరపాలెం', 'గీత గోవిందం' మరియు'చిలసౌ' సినిమాలు. అవార్డుల జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారు అని తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అవార్డులను వాయిదా వేయడం అందరినీ నిరాశ పరుస్తోంది. నిజానికి ప్రతి సంవత్సరం జాతీయ సినిమా అవార్డు విన్నర్ లను ఏప్రిల్ లో ప్రకటించి మేలో అవార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
ఎప్పటి లాగానే ఈ సారి కూడా విజేతల జాబితాను ఏప్రిల్ 22న విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం భారత దేశం లో ఎలక్షన్ హడావిడి ఉన్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఎన్నికల సమయంలో ఈ జాబితాను ప్రకటించడం నేరం. అందుకే ఎన్నికల వలన జాతీయ అవార్డులను వాయిదా వేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు స్వయంగా తెలిపారు. ఇక అవార్డుల జాబితా ను 9 తర్వాత విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే అవార్డుల కోసం మనం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే అన్నమాట.