మనం, 24 లాంటి విభిన్నమైన చిత్రాలకి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు విక్రమ్ కే కుమార్. అయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ... హీరో నాని మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసాడు . హీరో కార్తికేయ విలన్ రోల్ లో కనిపించాడు. ప్రియాంక అరుల్ హీరోయిన్ గా నటించింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం ...
కథ :
ఓ ఆరుగురు వ్యక్తులు కలిసి పంజాగుట్టాలోని ఓ బ్యాంకులో 300 కోట్ల దొంగతనం చేస్తారు , అయితే ఇందులో ఒకడు మిగతా ఐదుగురిని చంపి డబ్బుతో పరారి అవుతాడు. ఈ క్రమంలో అ ఐదుగురికి సంబంధించిన ఆడవాళ్లు అతనిపై పగ తీర్చుకోవాలని చూస్తారు . ఓ మంచి రివెంజ్ స్టొరీగా రాసి డబ్బులు సంపాదించుకుందాం అనుకున్న నవల రచయిత పెన్సిల్ పార్థసారథి( నాని ) సహాయం తీసుకుంటారు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి నాని అ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకి విలన్ కార్తికేయకి సంబంధం ఏంటి అన్నది మిగిలిన కథ ...
విశ్లేషణ :
విక్రమ్ కే కుమార్ సినిమా అంటే కథ, కథనాల విషయంలో మంచి అంచనాలు ఉంటాయి . కానీ ఈ సినిమాలో అవి ఆశించిన స్థాయిలో లేవని చెప్పాలి . ఓ ఇంట్రెస్టింగ్ దోపిడీతో సినిమాని మొదలు పెట్టిన దర్శకడు సినిమా మొత్తాన్ని అదే ఫ్లోలో తీసుకెళ్లడంలో తడబడ్డాడనే చెప్పాలి . మొదటిభాగంలో అసలు కథ మైన ట్రాక్ ఎక్కినా దానిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడిగా విక్రమ్ ఫెయిల్ అయ్యాడు. .రచయితగా మాత్రం ఒకే అనిపించాడు . ఫస్ట్ హాఫ్ లో కామెడి డైలాగ్స్ బాగా పేలాయి .ఇక రెండవ భాగంలో సాగదీత ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకుడుకి బోర్ ఫీలింగ్ కలుగుతుంది . ఇక హంతకుడు ఎవరు అని కనిపెట్టే సన్నివేశాలు కూడా పెద్దగా ఆసక్తి లేకపోవడం సినిమాకి అతిపెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు . ఇక సినిమా క్లైమాక్స్ , హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ సన్నివేశాలు పర్వాలేదు అనిపించాయి ..
నటినటులు :
సినిమాకి అతి పెద్ద బలం నానినే అని చెప్పాలి . ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో సినిమాని ఓన్ చేసుకున్నాడు . కొన్నికొన్ని సన్నివేశాల్లో నానిని ఎందుకు నాచురల్ స్టార్ అని ఎందుకు అంటారో అర్ధం అవుతుంది. అ తర్వాత సీనియర్ నటి లక్ష్మికి మంచి స్కోప్ ఉన్నా పాత్ర దక్కింది . హీరోయిన్ ప్రియాంక అరుల్ కి ఉన్నంతలో బాగానే నటించింది . విలన్ గా కార్తికేయ ఓ బ్యాడ్ బాయ్ పాత్రలో మంచి నటనని కనబరిచాడు ... మిగతా నటినటులు పాత్రల మేరకు ఒకే అనిపించారు .
సాంకేతిక వర్గం ;
అనిరుద్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోవు . అక్కడక్కడ నేపధ్య సంగీతం అలరిస్తుంది . నవీన్ నూలి తన ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలకు కత్తెరకు పని చెప్పితే బాగుండు అనిపిస్తుంది . కెమరామెన్ పనితనం సో సో గా ఉంది . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి .
చివరగా ఓ మాట: ఇది నానీ షో!
గమనిక : సినిమా రివ్యూ ఓ ప్రేక్షకుడి వ్యకిగత అభిప్రాయం మాత్రమే పూర్తి సినిమాని దియేటర్లోకి వెళ్లి చూడగలరు ..