Samantha: సమంతపై నిప్పులు చెరుగుతున్న నాగచైతన్య అభిమానులు

Samantha: సమంతా పై మండి పడుతున్న అభిమానులు

Update: 2021-11-25 15:30 GMT

సమంత పై మండిపడుతున్న అభిమానులు (ఫైల్ ఇమేజ్)

Samantha: టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య నిన్న తన 35వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమాలైన థాంక్యూ మరియు బంగార్రాజు చిత్ర బృందాలు తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను అభిమానులకు బహుమతి గా విడుదల చేశారు. సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలు నాగ చైతన్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ నాగచైతన్య మాజీ భార్య సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నప్పటికీ ఆమె మాత్రం నాగచైతన్య పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పకపోవడం అభిమానులు నిరాశకు గురి చేస్తోంది.

విడాకులు ప్రకటించే సమయంలో విడిపోయిన తర్వాత కూడా మేము స్నేహితులుగానే ఉంటామని నాగచైతన్య మరియు సమంత ఇద్దరూ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పక పోయేసరికి అభిమానులు ఆమె వైఖరిపై మండిపడుతున్నారు. చూస్తూ ఉంటే భవిష్యత్తులో సమంత మరియు నాగ చైతన్య కలిసి నటించే అవకాశం కూడా లేదని అనిపిస్తోంది. అయితే సమంత అభిమానులు మాత్రం ఒకవేళ సమంత శుభాకాంక్షలు చెప్పినట్లయితే అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసేది అని అందుకే సమంత మౌనంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News