Ustaad Bhagat Singh: అరే సాంబా రాస్కోరా..గబ్బర్ సింగ్ ని మించిన ఆల్బమ్ వస్తోంది
Ustaad Bhagat Singh: ఈ వీడియోలో అరేయ్ సాంబా రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ ఔతోంది. గతంలో హరీష్, పవన్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి క్రియేట్ చేయడంతో మళ్లీ 11 ఏళ్ల తర్వాత వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాల స్థాయి ఆకాశానికి అంటుకుంటోంది. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ డైలాగ్స్ కి తోడు సాంగ్స్ అటు మాస్ ఇటు క్లాస్ ఆడియెన్స్ ని కెవ్వు కేక పెట్టించడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ఎలాంటి ఆల్బమ్ ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్య ట్విట్టర్ లో నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ ఇంటరాక్షన్ లో పవన్ తో మరోసారి మాస్ స్టెప్పులు వేయించన్నా అంటూ ఓ నెటిజన్ కోరాడు. దీనికి హరీష్ తప్పకుండా అని బదులివ్వడంతో సినిమా సంగీతం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ మూవీ సిట్టింగ్స్ ని హరీష్ ప్రారంభించాడు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ దేవిశ్రీతో ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో అరేయ్ సాంబా రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. గబ్బర్ సింగ్ ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించేందుకు హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ రెడీ ఔతున్నట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఇద్దరు చాలా ఉత్సాహంగా కనిపించారు. మొత్తానికి, సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి అంతే త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని హరీష్ శంకర్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మొత్తంగా, గబ్బర్ సింగ్ ను మించే రేంజ్ లో పవన్ అభిమానులకు భారీ హిట్టివ్వాలని కంకణం కట్టుకున్న హరీష్..ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.