గత కొంతకాలంగా ఆ ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. కేవలం రెండు వారాల క్రితం వైయస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఇక రెండు రోజుల క్రితమే చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబు కి సంవత్సరం పాటు జైలు శిక్ష పడిందని వార్తలు బయటకు వచ్చాయి. ఆ వెంటనే అలాంటిదేమీ లేదు తను ఇంట్లోనే ఉన్నాను అంటూ మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మళ్లీ మోహన్ బాబు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి మోహన్ బాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై కంప్లైంట్ ఇచ్చారు.
అసలు కథలోకి వెళితే మోహన్ బాబు కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. మార్చి 26వ తారీకు నుండి ఎవరో తెలియని వారి నుంచి మోహన్ బాబు ఇలాంటి బెదిరింపు కాల్స్ ను అనుకుంటున్నారట. ఈ విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మోహన్ బాబు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసు పై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. కాల్ వచ్చిన ఫోన్ నెంబర్ అమెరికాకి చెందింది అని ఇప్పటికి నిర్ధారిత మైంది. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. పోలీసులు ప్రస్తుతం కాల్ చేసిన వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.