మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ల కోసం కథలు ఉన్నాయి అంటున్న మెహర్ రమేష్

* తన దగ్గర రెండు మంచి స్క్రిప్టులు ఉన్నాయని అందులో ఒకటి మహేష్ బాబుకి మరొకటి పవన్ కళ్యాణ్ కి బాగుంటుందని అన్నారు

Update: 2022-11-09 06:19 GMT

ఎం బి మరియు పవన్ కళ్యాణ్ ల కోసం కథలు ఉన్నాయి అంటున్నారు మెహెర్ రమేష్ 

Meher ramesh: 2004లో "వీరకన్నడిగా" అనే కన్నడ సినిమాతో డైరెక్టర్ గా మారిన మెహర్ రమేష్ ఎన్టీఆర్ నటించిన "కంత్రి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. మొదటి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన మెహర్ రమేష్ ఆ తర్వాత బిల్లా సినిమాతో పర్వాలేదనిపించారు. అయితే శక్తి మరియు షాడో వంటి డిజాస్టర్ సినిమాల తర్వాత సినిమాలకి కొంచెం దూరంగా ఉంటున్న మెహర్ రమేష్ మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా "భోళా శంకర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన "వేదాలం" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు మెహర్ రమేష్. తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన దగ్గర రెండు మంచి స్క్రిప్టులు ఉన్నాయని అందులో ఒకటి మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుందని మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాగుంటుందని అన్నారు.

అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం "భోళా శంకర్" పైనే ఉందని ఈ సినిమా తరువాతే మిగతా సినిమాల గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చారు మెహర్ రమేష్. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు మెహర్ రమేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటారో లేదో మాత్రం వేచి చూడాలి. మరోవైపు భోళాశంకర్ సినిమాలో కీర్తి సురేష్ మరియు తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతీశ్వర సాగర సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.

Tags:    

Similar News