చిక్కుల్లో పడిన పాపులర్ నటి

Update: 2019-02-12 06:07 GMT

మలయాళంలో పాపులర్ నటి మంజు వారియర్ ఇప్పుడు కష్టాల్లో పడింది. కొంతకాలం క్రితం ఈమె ఒక ప్రాంతానికి పర్యటనకు వెళ్లి అక్కడ స్లమ్ లో ఇబ్బంది పడుతున్న వారికి 57 పక్కా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చింది. ఇది జరిగి 18 నెలలు దాటింది కానీ ఇప్పటిదాకా అక్కడ ఒక ఇటుక కూడా పడింది లేదు. దాంతో ఆ ప్రాంతంలో ఉండే జనాలు మంజు వారియర్ ఇంటిముందు ధర్నాకు దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం మంజు ప్రభుత్వంతో చర్చలు జరిపింది కానీ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

ఒకవేళ ఆమె హామీ ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వం వారికి పక్కా ఇల్లు కట్టి ఇచ్చేది కానీ ఇప్పుడు ఈమె మాట ఇచ్చి మళ్ళీ మొహం చాటేస్తుంది అని వారి వాదన. మరి పబ్లిసిటీ కోసం ఇలా ప్రకటించిందో లేక ఏంటో తెలియదు కానీ ఇంకో రెండు రోజుల్లో ఈమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే వారు కచ్చితంగా ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగుతానని తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఇప్పటిదాకా ఆమె సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుని కూడగట్టుకున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసి పోతుంది.

Similar News