వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఇప్పటికే బోలెడు సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తాజాగా అశ్వినీదత్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' సినిమా కి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మహేష్ బాబు నటించిన 'సైనికుడు' సినిమా ఫ్లాప్ అయిన తరువాత మహేష్ అశ్వినీదత్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. చాలా కాలం తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ 'మహర్షి' సినిమా కోసం దిల్ రాజు మరియు పీవీపీ లతో పాటు అశ్వనీదత్ ని కూడా నిర్మాతగా తీసుకున్నారు.
పేరుకి నిర్మాత అయినప్పటికీ మిగతా ఇద్దరి కంటే నిర్మాణ వ్యవహారాలను దిల్ రాజు ఎక్కువగా చూసుకున్నారు. అయితే తాజాగా నిర్మాతలలో గొడవలు మొదలయ్యాయి. కృష్ణాజిల్లా లో 'మహర్షి' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను అశ్వినీదత్ తీసుకుందాం అనుకున్నారు. కానీ అప్పటికే దిల్ రాజు ఈ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు కాంట్రాక్ట్ కూడా సైన్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్మాత ల మధ్య గొడవలు వచ్చాయి. మహేష్ బాబు కూడా దిల్ రాజుకు మద్దతు ఇస్తూ ఇక అశ్విని దత్ తో మరొక సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఒక వేళ గొడవ ఒక కొలిక్కి రాకపోతే లీగల్ యాక్షన్ కూడా తీసుకోమని దిల్ రాజుకు చెపుతున్నట్లు సమాచారం.