Movies: బడ్జెట్‌ రూ. 6 లక్షలు.. వసూళ్లు రూ. 800 కోట్లు.. ఏ సినిమా అంటే..

Paranormal Activity: 2007లో వచ్చిన పారానార్మల్‌ యాక్టివిటీ (Paranormal Activity) అనే సినిమా ప్రపంచవ్యప్తంగా అసాధారణ రీతిలో కలెక్షన్స్‌ రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాను రూ. 6 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు.

Update: 2024-11-09 14:30 GMT

Paranormal Activity: కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌తో పని లేదని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఎంత ఎక్కువ బడ్జెట్‌ ఉంటే అంత ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో కూడా కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన బాలీవుడ్‌ మూవీ కశ్మీర్‌ ఫైల్స్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా నిర్మాణానికి కేవలం రూ. 15 కోట్లు ఖర్చు కాగా.. ఏకంగా రూ.341 కోట్ల వసూళ్లు సాధించింది. ఏకంగా 200 శాతం లాభాలను రాబట్టిందీ మూవీ. భారత్‌లో ఎక్కువ శాతం లాభాలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందీ మూవీ. అయితే ప్రపంచంలో ఎక్కువ శాతం లాభాలు రాబట్టిన మూవీ ఏంటో తెలుసా.? ఈ సినిమా ఏకంగా 13,30,300 శాతం లాభాలు రాబట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2007లో వచ్చిన పారానార్మల్‌ యాక్టివిటీ అనే సినిమా ప్రపంచవ్యప్తంగా అసాధారణ రీతిలో కలెక్షన్స్‌ రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాను రూ. 6 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే పారామౌంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ.. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి.. క్లైమాక్స్‌ను మార్చి విడుదల చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు అదనంగా రూ. 90 లక్షల వరకు ఖర్చు చేసింది. అయితే ఈ సినిమా ఏకంగా రూ. 800 కోట్లు వసూలు చేసి సినీ పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకోవడంతో ఈ చిత్రానికి ఆరు సీక్వెల్స్‌ను తెరకెక్కించారు. ఈ 6 చిత్రాలకు గాను రూ. 230 కోట్లు ఖర్చు చేస్తే మొత్తంగా ఏకంగా రూ. 7320 కోట్లు రాబట్టింది. ఇలా వరల్డ్‌ సినిమా హిస్టరీలో ఈ సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది.

Tags:    

Similar News