Kamal Hassan Birthday Special: కమల్ హాసన్ లైఫ్ టర్న్ చేసిన సినిమా అది

Update: 2024-11-07 10:12 GMT

Kamal Hassan Birthday Special: ఇవాళ విలక్షణ నటుడు కమల్ హాసన్ బర్త్ డే. నేటితో కమల్ హాసన్ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా థియేట్రికల్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ విడుదల చేశారు. సుమారు 44 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో కమల్ మల్టీపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. థగ్ లైఫ్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Full View

టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. కమల్ హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ చుట్టూ ఈ సినిమా తిరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కమల్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. భారతీయ సినిమా చరిత్ర ఉన్నంతకాలం గర్వించదగ్గ కళాకారుడు కమల్ హాసన్. సినిమా అనేది సాహిత్యం అయితే ఆయనను చరిత్ర స్టార్‌గానో, హీరోగానో కాదు గొప్ప కళాకారుడిగా గుర్తుంచుకుంటుంది. కేవలం యాక్టింగ్‌తోనే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన స్థానం ప్రత్యేకం.

ఇక థగ్ లైఫ్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్ కెరీర్‌లో 234వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో నాయకన్ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ అయింది. 35 ఏళ్ల తర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

నటుడిగా కమల్ హాసన్ ఇప్పటివరకు 175కు పైగా అవార్డులు పొందగా.. అందులో పద్దెనిమిది ఫిలింఫేర్ అవార్డులు ఉండడం విశేషం. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుపొందారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న కమల్ హాసన్ 70 ఏళ్ల వయస్సులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

కమల్ హాసన్ మొదటి సినిమా కన్నమ్మ, కలత్తూర్ కన్నమ్మ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్.. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. ఆ తర్వాత బాలనటుడిగా శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమిని గణేషన్ లాంటి తమిళ అగ్రనటులతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ డైరెక్టర్, ఫైటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సినిమాలను చేస్తూ ప్రతిచోటా తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు.

1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారి కమల్‌ను హీరోగా నిలబెట్టింది. అప్పటివరకు సినీరంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో అన్ని విభాగాలు టచ్ చేస్తూ వచ్చిన కమల్ హాసన్ ఈ సినిమా తరువాతే హీరోగా నిలదొక్కుకున్నాడంటారు. తెలుగులో అంతులేని కథ, మరో చరిత్ర సినిమాలతో స్టార్‌గా ఎదిగారు. అనంతరం స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాల్లో నటనకు కమల్ హాసన్ మూడు నంది అవార్డులను అందుకున్నారు. భామనే సత్యభామనే సినిమాలో ఆడ వేషంలో విచిత్ర సోదరులు సినిమాలో మరుగుజ్జు పాత్రలో జీవించి అద్భుతమైన నటన కనబరిచారు.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు కమల్ హాసన్. తమిళ హీరోనే అయినా తెలుగులో మంచి సినిమాలు చేశారు. హీరోగానే కాదు.. తనలోని దశావతారాలను చూపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. వందల సినిమాల్లో నటించిన కమల్ హాసన్.. నటుడిగా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తారు. అందుకే ఆయన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆయన చివరిగా ఇండియన్ 2 సినిమాలో నటించారు. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కల్కి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు.

ఆయన పేరు లేకుండా కమల్ హాసన్ లైఫ్ లేదంటారు

భారతీయ సినిమా గర్వించదగిన వారిలో కే బాలచందర్ పేరు ముందు వరుసలో కూడా ముందుంటుంది. ఆయన తెరకెక్కించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో కమల్ హాసన్, రజినీకాంత్ నటించిన సినిమాలకే ఎక్కువ పేరొచ్చింది. అందుకే కమల్ హాసన్, రజినికాంత్ లకు కే బాలచందర్ గురువు అని చెబుతుంటారు. కమల్ హాసన్ దురదృష్టం ఏంటంటే.. కే బాలచందర్ అనారోగ్యంతో చనిపోయినప్పుడు కమల్ ఇండియాలో లేరు. అలా ఆయన తన గురువు చివరి చూపునకు నోచుకోలేకపోయారు.


Full View


Tags:    

Similar News