Jr NTR: ఆ క్రేజీ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ మూవీ.. హింట్‌ ఇచ్చిన యంగ్ టైగర్‌..!

Jr NTR: యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

Update: 2024-09-19 11:45 GMT
Jr NTR Says he will Definitely Work in Atlee Direction soon

Jr NTR: ఆ క్రేజీ డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ మూవీ.. హింట్‌ ఇచ్చిన యంగ్ టైగర్‌..!

  • whatsapp icon

Jr NTR: యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర నటిస్తోన్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అదే విధంగా జనతా గ్యారేజీ తర్వాత కొరటాల-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంచనాలకు అనుగుణంగానే కొరటాల శివ ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు.

రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా, ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ తాజాగా ఓ కోలీవుడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన తర్వాతి చిత్రానికి సంబంధించి హింట్‌ ఇచ్చారు.

దేవర మూవీ తర్వాత ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌-అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చాయి. ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'అట్లీ చాలా ట్యాలెంట్‌ ఉన్న దర్శకుడు. ఆయన నాకు ఓ ఆసక్తికర రొమాంటిక్‌ కామెడీ స్టోరీ లైన్ చెప్పారు. దీని గురించి మేమిద్దరం చర్చించుకున్నాం. అయితే నేను, అట్లీ ఇద్దరం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడం వల్ల అది పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో అట్లీతో కచ్చితంగా సినిమా చేస్తాను. ఆయన ‘రాజారాణి’ సినిమాను తెరకెక్కించిన విధానం నాకెంతో నచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. జవాన్ మూవీతో ఒక్కసారిగా దర్శకుడు అట్లీ నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. దీంతో అలాంటి దర్శకుడు ఎన్టీఆర్‌తో మూవీ చేస్తుండడంతో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే అట్లీ అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బన్నీ ముందుగా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. దీంతో అట్లీ తొలుత ఎన్టీఆర్‌, బన్నీలలో ఎవరిని డైరెక్ట్ చేయనున్నారో చూడాలి. 

Tags:    

Similar News