బాగా తగ్గిపోయిన 'జెర్సీ' హంగామా

Update: 2019-04-24 16:50 GMT

వరుసగా రెండు డిజాస్టర్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. సినిమా చూసిన అందరు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ కలెక్షన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద అంత హడావుడి చేయకపోవడం గమనార్హం. నిజంగా బ్లాక్ బస్టర్ అయితే వీక్ డేస్ లో కూడా టికెట్ల రద్దీ అలానే కొనసాగాలి కానీ 'జెర్సీ' పరిస్థితి అలా లేదు. కలెక్షన్లు స్టడీగా గానే ఉన్నప్పటికీ మరీ బ్లాక్ బస్టర్ రేంజిలో లేవని తెలుస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ లాంటి యువ హీరో మాత్రం కేవలం 'గీతగోవిందం' సినిమాతోనే 62 కోట్ల దాకా షేర్లను నమోదు చేసుకున్నాడు.

మరోవైపు నాని 'జెర్సీ' సినిమా మాత్రం ఇంకా 40 కోట్ల షేర్ ను దాటాల్సి ఉంది కానీ 40 కోట్ల షేర్ ను దాటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ వారంలోనే ఎవెంజర్స్ అండ్ గేమ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రభావం కచ్చితంగా 'జెర్సీ' పైన పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో 'జెర్సీ' సినిమా రాబోయే వీకెండ్ మరియు మిగతా పది పదిహేను రోజుల్లో ఎంత వసూలు చేస్తే దాని మీదనే ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

Similar News