'గొ కరోనా' అంటూ 'జాంబి రెడ్డి' గీతాలాపన!
జాంబీ గేమ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ గేమ్ లో ఆడుతూ జాంబీలను చంపుతూ సరదా పడిపోతారు. అదే జాంబీలతో ఒక సినిమా వస్తే ఎలావుంటుంది? ఆ అనుభూతిని టాలీవుడ్ లో తొలిసారిగా పరిచయం చేయబోతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
జాంబీ గేమ్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ గేమ్ లో ఆడుతూ జాంబీలను చంపుతూ సరదా పడిపోతారు. అదే జాంబీలతో ఒక సినిమా వస్తే ఎలావుంటుంది? ఆ అనుభూతిని టాలీవుడ్ లో తొలిసారిగా పరిచయం చేయబోతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. టాలీవుడ్ తొలి జాంబీ సినిమాగా ''జాంబీ రెడ్డి'' సిద్ధం చేశారు. ఈ సినిమాలో బాల నటుడిగా అందరి మనసులు దోచుకున్న తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంది-దక్ష నగార్కర్ హీరోయిన్లు.
ఈ సినిమా ఫస్ట్ బైట్ - బిగ్ బైట్ ఇప్పటికే విడుదల చేశారు. వాటితో సినిమా పై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. జాంబీ లతో కనిపించిన సీన్లు ఇప్పటికే చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ఇప్పుడు తాజాగా జాంబి రెడ్డి సినిమా నుంచి 'గో కరోనా' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
'ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా' అంటూ సాగిన ఈ పాటకు మార్క్ కె రాబిన్ ట్యూన్ ఇచ్చారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తూ జరిగిన విషయాలను ఈ పాటలో ప్రస్తావించారు. మామా సింగ్ లిరిక్స్ అందించి.. పాటు ర్యాప్ ఇచ్చారు. ఈ పాటను అనుదీప్ - శ్రీకృష్ణ - మార్క్ కె రాబిన్ కలిసి పాడారు.
'జాంబీ రెడ్డి' చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రఘుబాబు - పృథ్వీరాజ్ - జబర్దస్త్ శ్రీను - హేమంత్ - హరితేజ - అన్నపూర్ణమ్మ - కిరీటి - రమరఘు కీలక పాత్రలు పోషించారు.