Punch Prasad: ఆందోళనకరంగా జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం..

Punch Prasad Health: గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది.

Update: 2022-11-18 11:14 GMT

Punch Prasad: ఆందోళనకరంగా జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం..

Punch Prasad Health: గత కొంత కాలంగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా ప్రసాద్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పుకొచ్చాడు. ప్రసాద్ భార్య ఈ వీడియోను అతనికి తెలియకుండా తీయడంతో అతని ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని ప్రేక్షకులకు తెల్సింది.

ఇక పంచ్ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం.. ఓరోజు షూటింగ్ తర్వాత ఫీవర్‌గా ఉందని ఇంటికొచ్చిన ప్రసాద్.. నడుము నొప్పితో చాలా బాధపడ్డాడు. అలా నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టర్స్ కూడా ఫస్ట్ ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదని, టెస్టులు చేస్తే నడుము వెనక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసింది' అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News