Nani: టిక్కెట్ రేట్ల గురించి మాట్లాడను అంటున్న నాని
Nani: టికెట్ రేట్ల విషయంలో తెలివిగా తప్పించుకున్న నాని
Nani: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ఇష్యూ జరుగుతున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని హీరోలలో గొంతు విప్పిన వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ బిల్లును అసెంబ్లీలో ఇష్యూ చేయడానికి నాని ససేమిరా అడ్డుకున్నారు. కానీ కొద్ది రోజుల క్రితమే జగన్ ప్రభుత్వం ఫిక్స్డ్ టికెట్ రేట్ లని మరియు ఒక్క ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ ని మాత్రమే ఉండేలాగా ఒక బిల్లు ను స్టేట్ అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఇద్దరు ముగ్గురు హీరోలు దీని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నాని సత్యదేవ్ మరియు నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన "స్కైలాబ్" అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు కానీ దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
"నేను లాస్ట్ టైం టికెట్ రేట్ల గురించి మాట్లాడినప్పుడు అన్ని న్యూస్ ఆర్టికల్స్ దాని గురించే వచ్చాయి. కానీ కంగారు పడకు సత్య ఈసారి నేను టికెట్ల రేట్లు గురించి కానీ థియేటర్ల గురించి కానీ మాట్లాడను" అని తెలివిగా తప్పించుకున్నారు నాని. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంతకు ముందు నాని టికెట్లు రేట్లు గురించి మాట్లాడింది సత్యదేవ్ హీరోగా నటించిన "తిమ్మరుసు" సినిమా ప్రమోషన్ ఈవెంట్ లోనే. "నిత్యవసర వస్తువులు అయిన కూరగాయలు, ఆయిల్, పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై రేట్లను పెంచుతున్న ప్రభుత్వం సినిమా విషయానికి వచ్చేసరికి నిబంధనలను పెడుతోంది ఎందుకు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నాని.