TV Serial: సీరియల్స్‌లో ట్రెడిషినల్.. సోషల్ మీడియాలో హాట్. ఎవరో గుర్తుపట్టారా.?
Raksha Gowda: సీరియల్స్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ లుక్‌లో అదరగొడుతోంది.
Raksha Gowda: ఒకప్పుడు టీవీ సీరియల్స్‌లో నటీమణులు అంటే నెగిటివ్ షేడ్స్‌లో ఉంటారు, ఎప్పుడు ఏడుపు అనే భావన ఉండేది. కానీ మారిన కాలానికి అనుగుణంగా టీవీ సీరియల్స్ హీరోయిన్స్ క్యారక్టరైజేషన్ కూడా మారిపోయింది. ఇతర భాషలకు చెందిన నటీమణులు సైతం తెలుగు సిరీయల్స్‌లో సందడి చేస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న నటీమణి కూడా సీరియల్ హీరోయిన్ అని మీలో ఎంత మందికి తెలుసు.?
సీరియల్స్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ లుక్‌లో అదరగొడుతోంది. ఇంతకీ ఈ నటీమణి ఎవరో కాదు గుప్పెడంత మనసు సీరియల్ నటి రక్ష గౌడ. గుప్పెడంత సీరియల్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. మంచి రేటింగ్ సంపాదించుకున్న ఈ సీరియల్‌లో నటించింది రక్ష గౌడ. 2020లో ప్రారంభమైన ఆ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సీరియల్‌లో రక్షగౌడ వసుధార పాత్రలో కనిపించి మెప్పించింది. అందం, అమాయకత్వం, తెలివైన అమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుందీ బ్యూటీ. ఇక సీరియల్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రక్షగౌడ వ్యక్తిగత విషయానికొస్తే.. రక్షగౌడ కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. బెంగుళూరులో విద్య పూర్తి చేసిన ఈ బ్యూటీ.. బీబీఎం పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రాధా రమణ సీరియల్ ద్వారా సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిందీ బ్యూటీ.