ఒక్కమగాడు ప్లాప్ పై స్పందించిన వైవిఎస్ ..సినిమా ఎందుకుపోయిందంటే

YVS Chowdary: సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారాండి సినిమాతో టాలీవుడ్ లో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యాడు వైవిఎస్ చౌద‌రి.

Update: 2021-06-02 09:54 GMT

Yvs chowdary Twitter Photo

YVS Chowdary: సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారాండి సినిమాతో టాలీవుడ్ లో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యాడు వైవిఎస్ చౌద‌రి. సీతారామ‌రాజు, లాహిరి లాహిరి లాహిరిలో.., సీత‌య్య వంటి బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ ద‌ర్శ‌కులలో ఒక్క‌డిగా నిలిచాడు. తెలుగు సినిమా చ‌రిత్ర‌ల్లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం దేవ‌దాస్.. అదే టైటిల్ తో యుత్ స్టార్ రామ్ ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తూ..దేవ‌దాస్ అనే ప్రేకక‌థ‌ను తెర‌కెక్కించాడు. ఇక ఈ సినిమా అత్య‌ధిక రోజులు ఆడ‌డంమే కాకుండా..2006 టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది. ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యమైన రామ్ వెనుతిరికి చూసుకోలేదు. హీరోయిన్ ఇలియాన‌కు వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి.

అంతా బానే ఉంది ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ఈ సినిమా త‌ర్వాత వైవిఎస్ చౌద‌రి లైవ్ ఒక్క‌సారిగి ట‌ర్న్ అయింంది. న‌ట‌సింహం బాల‌య్య‌తో ఒక్క‌మ‌గాడు సినిమా తీశాడు. టైటిల్ లోనే పౌరుషం చూపించిన వైవిఎస్.. సినిమాను మ‌రో సీత‌య్య కంటే హిట్ ఇస్తార‌ని అంతా భావించారు.స్వ‌త‌హాగా ఎన్టీఆర్ అభిమానైన వైవిఎస్.. ఒక్క‌మగాడుతో బాల‌య్య‌కు సూప‌ర్ హిట్ ఇస్తార‌ని అభిమానులు కూడా భావించారు. ఈ సినిమా రిలీజ్ కాగానే క‌థ అడ్డం తిరిగింది. ఈ సినిమా అభిమానుల అంచాల‌ను అందుకోలేక‌పోయింది. అంతేకాదు చౌద‌రి కెరీర్ పై పెద్ద దెబ్బ ప‌డింది. ఆ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఒక్క హిట్ రాలేదు. అంతే కాదు ర‌వితేజ, మంచు విష్ణు, సాయి ధ‌ర‌మ్ తేజ్ తో చేసిన సినిమాలు కూడా వ‌రుస ఫ్లాపుల కావ‌డంతో ఇక చౌద‌రి కోలుకోలేదు.

ఇక ఒక్క మ‌గాడుతో బాల‌య్య కెరీర్ లోనే అతిపెద్ద డిజార్ట్ ఇచ్చిన చౌద‌రి 13 ఏళ్ల త‌ర్వాత ఆ చిత్రంపై స్పందించాడు. ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో ఎన్టీఆర్ మీద పెట్టిన ఒక స్పేస్‌లోనూ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'ఒక్కమగాడు' గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ఆ సినిమా విషయంలో తాను చేసిన తప్పేంటో ఆయన వివరించాడు.

'ఒక్క మగాడు'కు ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాల్లో ఉన్న విపరీతమైన వయొలెన్స్, డబుల్ మీనింగ్ పాటలు.. ''నేను నరికానంటే ఏ ముక్క ఎక్కడ పడిందో వెతుక్కోవడానికి వారం పడుతుంది'' లాంటి డైలాగుల వల్ల ఆయన యూత్‌కు దూరం అయిపోయారని.. సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన కామెడీ నడిచిందని.. అందుకే హింస లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌, యూత్‌కు నచ్చేలా ఒక కాజ్ కోసం కథ నడిచేలా, ఒక ప్రాపర్ సినిమా తీయాలని అనుకున్నానని.. ఈ ఆలోచనే పెద్ద తప్పు అయిందని, అందువల్లే 'ఒక్క మగాడు' దెబ్బ తిందని చౌదరి అన్నాడు.

అయితే ఒక్క‌మగాడు సినిమాలో కూడా హింస వుంది. ఒక్క మ‌గాడు సినిమాను భార‌తీయుడు సినిమా సిక్వెల్ అంటూ కామెంట్లు చేశారు. స్వ‌తంత్ర స‌మర‌యోధుడిగా చేసిన‌ బాలయ్య గెట‌ప్ అభిమానుల్లో సినిమా విర‌క్తిని క‌లిగించింద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. బాల‌య్య నుంచి అభిమాన‌లు కొరుకునే సినిమాను కాదుక‌దా.. ఆ స్థాయికి చేరువ కూడా కాలేద‌ని అభిమానులు ఫీల్ అయ్యారు. 

Tags:    

Similar News