రెండో పెళ్ళికి సిద్దమవుతున్న ప్రభుదేవా
ఇక ఇదిలా ఉంటే ప్రభుదేవా ప్రస్తుతం రెండో పెళ్ళికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. తన చుట్టాలమ్మాయితో ప్రభుదేవా గత కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. .
సుందరం మాస్టారు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభుదేవా.. తండ్రి లాగే ముందుగా కొరియోగ్రాఫర్ గానే స్థిరపడిన ప్రభుదేవా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.. ఆ తరవాత నటుడుగా, దర్శకుడిగా మారి అంచలంచలుగా ఎదిగాడు. గత ఏడాది సల్మాన్ ఖాన్ తో దబాంగ్ 3 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా రాధే అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని ధియేటర్ లోనే రిలీజ్ చేయనున్నారు.
సినీ కెరీర్ ఎలాంటి డిస్ట్రబ్ లేకుండా సాగిపోతున్న ప్రభుదేవాకి పర్సనల్ లైఫ్ లో మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా 1995లో రామలతని వివాహం చేసుకున్నాడు ప్రభుదేవా.. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు ప్రభుదేవా.. ఆ తర్వాత కొద్ది రోజులు నయనతారతో ప్రేమాయణం నడిచినట్టుగా వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత నయనతార నుంచి బ్రేకప్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక ఇదిలా ఉంటే ప్రభుదేవా ప్రస్తుతం రెండో పెళ్ళికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. తన చుట్టాలమ్మాయితో ప్రభుదేవా గత కొద్దిరోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక అటు నయనతార తమిళ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.