Director Krish Marriage: డాక్టర్ ప్రీతి చల్లాతో క్రిష్ వివాహం.. ఫొటో వైరల్
Director Krish Marriage: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. డాక్టర్ ప్రీతి చల్లాతో ఆయన ఏడడుగులు వేశారు.
Director Krish Marriage: టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. డాక్టర్ ప్రీతి చల్లాతో ఆయన ఏడడుగులు వేశారు. క్రిష్ కి ఇది రెండో పెళ్లి. ఇది వరకు ఆయన రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకొన్నారు. పెళ్లయ్యాక రెండేళ్లకే విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.
ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రీతీ చల్లాని డైరెక్టర్ క్రిష్ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత దిగిన ఫొటోలతో ఓ చిన్న వీడియో చేసి తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రీతీకి కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అని సమాచారం.