సినిమా కి లాభం అయినా నష్టమైన కేవలం నిర్మాతకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాకి ముగ్గురు నిర్మాతలు ఉండడంతో సెటిల్మెంట్ చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమా సినిమాను నిర్మించారు. అయితే అశ్వినీదత్ గతంలో 'దేవదాసు' సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్ సునీల్ కి 60 లక్షలు బాకీ పడ్డారు. 'మహర్షి' డబ్బులు రాగానే బాకీ తిరిగి ఇమ్మని సునీల్ అడిగినట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన ఇద్దరు నిర్మాతలు దీనికి ససేమిరా ఒప్పుకోవడంలేదు. ఒకవైపు కోటి 50 లక్షల దాకా సినిమా బిజినెస్ చేసినా తన డబ్బులు తనకు ఇవ్వడం లేదంటూ న్యాయ సలహాలు వరకు వెళ్లారు సునీల్.
విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వివాదాలు మంచిది కాదని అర్థం చేసుకున్న అశ్వనీదత్ కూతురు స్వప్న దత్ సునీల్ కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకని విడుదలైన తర్వాత గొడవ పడే బదులు ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం మంచిదని పరస్పరం చర్చించుకొని ఒక అండర్స్టాండింగ్ కి వద్దామని దిల్ రాజు మిగతా ఇద్దరు నిర్మాతలకు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ త్వరగా ఏదో ఒక నిర్ణయానికి ముగ్గురు నిర్మాతలు రావడం మంచిదని ఇండస్ట్రీ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన 'మహర్షి' సినిమా మే 9 న విడుదల కానుంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.