సీఎం పై కీలక వాఖ్యలు.. బీజేపీ నేత పైన కేసు నమోదు!

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు నమోదైంది. తాజాగా అయన చేసిన వివాదాస్పద వాఖ్యలే దీనికి కారణం అయ్యాయి..

Update: 2020-09-28 12:59 GMT

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు నమోదైంది. తాజాగా అయన చేసిన వివాదాస్పద వాఖ్యలే దీనికి కారణం అయ్యాయి.. కరోనా విషయంలో బెంగాలీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది అంటూ బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది.

ఈ క్రమంలో 'నాకు ఏదో ఒక సమయంలో కరోనా వస్తుంది. నేను అప్పుడు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, ప్రియమైన వారిని కోల్పోతే కలిగే బాధ తెలుస్తాయి' అంటూ అనుపమ్ హజ్రా కామెంట్స్ చేశారు. ఒక మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనితో అనుపమ్ హజ్రాపై కేసు నమోదు అయింది. అయితే అనుపమ్ హజ్రా వాఖ్యాల పైన బీజేపీకి నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ స్పందించారు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.. ఆదివారం సాయంత్రం బారుపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో హజ్రా ఈ వాఖ్యలు చేశారు.

అటు పచ్చిమ బెంగాల్ లో 4,721 మరణాలతో 2.4 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. గడిచిన 24 గంటల్లో 60 మరణాలతో అత్యధిక మరణాలు సంభవించిన ఐదు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News