Chiranjeevi Donation: వరద బాధితులకు అండగా చిరు.. భారీ విరాళం ప్రకటించిన మెగాస్టార్

Chiranjeevi Donation: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వానలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-04 04:45 GMT

Chiranjeevi Donation: వరద బాధితులకు అండగా చిరు.. భారీ విరాళం ప్రకటించిన మెగాస్టార్

Chiranjeevi Donation: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు వరద బీభత్సంలో అతలాకుతలం అవుతున్నాయి. దీంతో వరద పరిస్థితిని చూసి అందరూ కలత చెందుతున్నారు. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్ ఇలా ఒక్కొక్కరు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు.

ఇక తెలుగు రాష్ట్రలో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన నష్టంతనకు కలిచివేసిందని అన్నారు చిరు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు చిరు.

అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు చిరంజీవి. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు.

Tags:    

Similar News